ఏటూరునాగారం ఐటీడీఏ పీవోకు కలెక్టర్గా ప్రమోషన్.. కరీంనగర్ కు బదిలీ

ఏటూరునాగారం ఐటీడీఏ పీవోకు కలెక్టర్గా ప్రమోషన్.. కరీంనగర్ కు బదిలీ

ఏటూరునాగారం, వెలుగు: ఏటూరునాగారం ఐటీడీఏ పీవో చిత్రా మిశ్రా కలెక్టర్ గా ప్రమోషన్​పొందారు. ఆమెను కరీంనగర్​కు బదిలీ చేస్తూ ప్రభుత్వం బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేసింది. 2019 ఐఏఎస్ బ్యాచ్​కు చెందిన చిత్రా మిశ్రా ఐటీడీఏకు మొదటి మహిళా పీవోగా 2024లో బాధ్యతలు చేపట్టారు. గిరిజనుల సంక్షేమానికి కృషి చేశారు. బదిలీపై వెళ్తున్న ఆమెకు ఐటీడీఏ ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. ఐటీడీఏకు నూతన పీవోగా ఎవరినీ నియమించలేదు. కలెక్టర్​ దివాకర టీఎస్​కు అదనపు బాధ్యతలు అప్పగించనున్నట్లు సమాచారం.